BELలో భారీగా ఉద్యోగాలు.. బిటెక్/ బీఈ/ బీఎస్సీ చేసినోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి...

BELలో భారీగా ఉద్యోగాలు.. బిటెక్/ బీఈ/ బీఎస్సీ చేసినోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి...

భారత ప్రభుత్వరంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో 340 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టులు: 340. 

పోస్టుల సంఖ్య: ప్రొబెషనరీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) ఈII గ్రేడ్ 175, ప్రొబెషనరీ ఇంజినీర్ (మెకానికల్) ఈII గ్రేడ్ 109, ప్రొబెషనరీ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) ఈII గ్రేడ్ 42, ప్రొబెషనరీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ఈII గ్రేడ్ 14. 

ఎలిజిబిలిటీ
ప్రొబెషనరీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) ఈII గ్రేడ్: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ విభాగంలో బి.టెక్/ బీఈ/ బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

ప్రొబెషనరీ ఇంజినీర్ (మెకానికల్) ఈII గ్రేడ్: మెకానికల్ విభాగంలో బి.టెక్/ బీఈ/ బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.   

ప్రొబెషనరీ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) ఈII గ్రేడ్ : కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగంలో బి.టెక్/ బీఈ/ బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ప్రొబెషనరీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ఈII గ్రేడ్: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్​లో బి.టెక్/ బీఈ/ బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. పై విద్యార్హతల్లో అన్ రిజర్వ్​డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది. 

వయోపరిమితి (2025 అక్టోబర్ 01 లోపు): గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేండ్లు 
వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 24.

లాస్ట్ డేట్: నవంబర్ 14. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్లను షార్ట్​లిస్ట్ చేసి అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూలో  కనీస అర్హత సాధించాలంటే జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్​లు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. 

పూర్తి వివరాలకు https://bel-india.in/homepage/ వెబ్​సైట్​లో సంప్రదించగలరు.