
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పాదయాత్ర సాగుతోంది. మలప్పురంలో ముగిసిన యాత్ర రాహుల్ నియోజకవర్గమైన వయనాడ్ కు చేరుకుంది. ఇవాళ నిలంబూర్ లోని చుంగతార నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. సెప్టెంబర్ 10న తమిళనాడు నుంచి కేరళలోకి ప్రవేశించిన ఈ యాత్ర రేపు కర్ణాటకకు చేరనుంది.
19 రోజలు వ్యవధిలో 7 జిల్లాల మీదుగా 450 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో యాత్ర జరగనుంది. తర్వాత రాహుల్ యాత్ర తెలంగాణలో కొనసాగనుంది. అక్టోబర్ 24న మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ లో ప్రవేశించి 366 కిలోమీటర్ల మేర సాగనుంది. మొత్తం 4 నియోజకవర్గాల్లోని 9 అసెంబ్లీల్లో రాహుల్ యాత్ర సాగనుంది. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర 150 రోజలు పాటు సాగనుంది. ఈ యాత్ర మొత్తం 3వేల 750 కిలోమీటర్ల మేర సాగనుంది. కాగా, రాహుల్ పాదయాత్ర ఇవాళ్టికి 22వ రోజుకు చేరుకుంది.