పాజిటివ్ రెస్పాన్స్​తో భరతనాట్యం

పాజిటివ్ రెస్పాన్స్​తో భరతనాట్యం

సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా  ‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించిన చిత్రం ‘భరతనాట్యం’. ఏప్రిల్ 5న విడుదలైంది.  సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు టీమ్ శనివారం ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించింది. సూర్య తేజ మాట్లాడుతూ ‘సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని అభినందించారు.  నేను చక్కగా నటించానని, మొదటి సినిమాలా అనిపించలేదని చెప్పడం ఆనందంగా ఉంది అని చెప్పాడు. 

తన పాత్రకు మంచి స్పందన వస్తోందని మీనాక్షి గోస్వామి చెప్పింది. కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ ‘థియేటర్స్‌‌లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.  అందరూ పాజిటివ్‌‌గా చెబుతూ  మంచి రివ్యూస్ ఇచ్చారు’ అని అన్నాడు. నిర్మాత పాయల్ సరాఫ్ మాట్లాడుతూ ‘సినిమాకొస్తున్న రెస్పాన్స్‌‌ చూసి కొన్నిచోట్ల థియేటర్స్ పెంచారు. వీకెండ్స్‌‌తో పాటు ఉగాది హాలీడేస్ కూడా మాకు హెల్ప్ అవుతాయి’ అని అన్నారు.