సీ విజిల్ యాప్​నకు వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరిస్తం: భారతి హొళికేరి

సీ విజిల్ యాప్​నకు వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరిస్తం: భారతి హొళికేరి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఓటర్లను ప్రలోభ పెట్టినా, భయభ్రాంతులకు గురిచేసినా సీ విజిల్ యాప్ ​ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హొళికేరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ప్లే స్టోర్ యాప్ ద్వారా  సీ విజిల్ యాప్​ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆమె తెలిపారు.

సమస్యకు సంబంధించిన ఫొటోతో పాటు జరిగిన విషయాన్ని టైప్ చేసి పంపించాలన్నారు. దివ్యాంగుల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ సాక్ష్యం యాప్​ను తీసుకొచ్చిందని కలెక్టర్ తెలిపారు. ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని దివ్యాంగులు సాక్ష్యం యాప్ సేవలను పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.