
తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిచేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన వ్యవహా రాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించామని తెలిపారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు.
►ALSO READ | మార్వాడీ గోబ్యాక్ అంటూ.. ఆగస్టు 18న అమనగల్లు బంద్ కు పిలుపు
మార్వాడీలు మనలో ఒకరు.. వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు మహేశ్ కుమార్. గాం ధీభవన్ ప్రకాశం హాల్ లో జరిగిన అసంఘటిత కార్మికుల సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. 'ఉదయమే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూశా.. మంత్రుల నియోజకవర్గాలకు నిధులు తీసుకెళ్తున్నారు అని అన్నట్టు నాకు అర్థం అయ్యింది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటం. రాజగోపాల్రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది' అని తెలిపారు.