ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్..  రూ.31 లక్షల ప్రాఫిట్

 ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్..  రూ.31 లక్షల ప్రాఫిట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాహనదారుల ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ ఆర్టీఏకు కాసుల వర్షం కురిపించింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో  టీజీ 09ఎల్ 0009 నంబర్​ను మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ అత్యధికంగా రూ. 10,50,000 వెచ్చించి సొంతం చేసుకుంది. టీజీ 09 ఎల్ 0007 నంబర్​ను తిరుపతి రావు పెద్దింటి రూ. 3,19,999కు దక్కించుకున్నారు.

అలాగే అనిరుధ్ ఆగ్రో ఫామ్స్ లిమిటెడ్ సంస్థ టీజీ 09 ఎల్ 0005 కోసం రూ. 2,00,005, ముప్పా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టీజీ 09 కె 9999 కోసం రూ. 1,50,000, తిక్కవరపు మంజులారెడ్డి టీజీ 09 ఎల్ 0024 కోసం రూ. 1,00,024, అర్జున్ పటేల్ టీజీ 09 ఎల్ 0001 నంబర్​ను రూ. లక్షకు వేలంలో దక్కించుకున్నారు.