యువ హీరో కిరణ్ అబ్బవరం గురువారం ‘యూత్’ అనే కొత్త చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. తమిళంలో ఇదే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హౌస్ పుల్ వినీత్, సందీప్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. త్వరలోనే తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. ప్రేమలు, లిటిల్ హార్ట్స్ చిత్రాల తరహాలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
