రోడ్డు భద్రతపై  షార్ట్ ఫిల్మ్,  రీల్స్ పోటీలు

రోడ్డు భద్రతపై  షార్ట్ ఫిల్మ్,  రీల్స్ పోటీలు
  • సైబరాబాద్ పోలీసుల వినూత్న కార్యక్రమం

గచ్చిబౌలి, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘అరైవ్ అలైవ్’  ప్రచారంలో  భాగంగా ఫిల్మ్ మేకర్లు, సోషల్ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్లు, విద్యార్థులు, సాధారణ ప్రజల కోసం ఓపెన్ రోడ్ సేఫ్టీ షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ మేకింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్​లో మొబైల్ వినియోగం వంటి అంశాలపై 30 నుంచి 90 సెకన్ల వ్యవధి గల వీడియోలను రూపొందించాలి.

పోటీదారులకు అవసరమైన గత రెండేళ్ల ప్రమాద గణాంకాలను పోలీసులే అందిస్తారు. సృజనాత్మకత, విషయ నాణ్యత ఆధారంగా జ్యూరీ ఎంపిక చేసే ఉత్తమ ఎంట్రీలకు మొదటి మూడు స్థానాల్లో నగదు బహుమతులు, మిగిలిన వారికి అభినందన పత్రాలు అందజేస్తారు. ఆసక్తి ఉన్నవారు తమ వీడియోలను ఈ నెల 31వ తేదీలోపు పంపాలని, మరిన్ని వివరాలకు 8712684840 నంబర్​ను లేదా ctpsocialmediateam@gmail.com మెయిల్​ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.