
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం పైన తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆగస్టు 17న సీఎం రేవంత్ తో టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం భేటీ అయి పలు విషయాలపై చర్చించారు.
బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వే షన్లపై సందిగ్ధత, ఎన్నికల నిర్వహణకు కోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. అలాగే ఆగస్టు 23న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.