
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ గురించి వచ్చే వారం చర్చిస్తామన్నారు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి . ఆగస్టు 17న క్రమశిక్షణ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని చెప్పారు. ఈ విషయమై చాలా సేపు చర్చించినట్లు చెప్పారు. సమస్య రిపీట్ కాకుండా ఒకసారి చెప్పి చూస్తా మని, మళ్లీ రిపీట్ అయితే రాజగోపాల్ రెడ్డిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. మంత్రి పదవి విషయంలో రాజోపాల్ రెడ్డి పదే పదే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన వివరాలు సేకరిస్తున్నాం..పూర్తి వివరాలు వచ్చాక వచ్చేవారం చర్చిస్తామని చెప్పారు మల్లు రవి.
►ALSO READ | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కలయికే ఇండియా.. మనం లేకుంటే దేశమే లేదు: టీపీసీసీ చీఫ్
వరంగల్ పంచాయితీపై మల్లు రవి వివరణ ఇస్తూ వరంగల్ కు నలుగురిని పంపించబోతున్నట్లు తెలిపారు. ఎవరెవరు వెళ్లాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. దీంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు.