- మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి/మదనాపురం, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం అమరచింత, ఆత్మకూరు పట్టణాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పలు పట్టణాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. త్వరలో ఆత్మకూరును రెవెన్యూ డివిజన్చేస్తామని ప్రకటించారు.
ఆత్మకూరు మినీ బస్ డిపో, 100 పడకల ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జూరాల, గద్వాల్ వెళ్లే రోడ్డుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.123 కోట్ల నిధులు మంజూరు చేశారని, పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సీపీఎం కార్యదర్శి. జాన్ వెస్లీ, టీపీసీసీ కార్యదర్శి నాగరాజు గౌడు తదితరులు పాల్గొన్నారు.
