
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కలయికే భారత దేశమని.. మనం లేకుంటే అసలు దేశమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఆదివారం (ఆగస్ట్ 17) రవీంద్రభారతిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ సమైక్య ఆధ్వర్యంలో నేషనల్ కన్వెన్షన్ అండ్ ఫెలిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశాన్ని ఏలుతున్న వారు మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు.
మనమంతా ఐక్యంగా ఉంటేనే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమన్నారు. మహారాష్టలో బీజేపీ గెలవడానికి మోడీ ఓట్ చోరీ చేశాడని ఆరోపించారు. దేశంలో కార్పొరేట్ శక్తులను పెంచి పోషించడానికే బీజేపీ పార్టీ పనిచేస్తుందని విమర్శించారు. మత వాద శక్తులను అడ్డుకోవాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాహుల్ గాంధీ వెంట నిలబడాలని పిలుపునిచ్చారు.
►ALSO READ | కాళేశ్వరం మోటర్లను నాశనం చేసే కుట్ర: హరీశ్ రావు