మేడ్చల్ సరోగసి కేసులో షాకింగ్ నిజాలు: ఇంటి ఫస్ట్ ఫ్లోర్ రూమ్ బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చి మరీ... వీర్యం సేకరణ.. !

మేడ్చల్ సరోగసి కేసులో షాకింగ్ నిజాలు: ఇంటి ఫస్ట్ ఫ్లోర్ రూమ్ బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చి మరీ... వీర్యం సేకరణ.. !

మేడ్చల్ సరోగసి కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మి రెడ్డిపై 2024లో ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కు చేరుకున్న లక్ష్మి రెడ్డి.. కొడుకు సురేందర్ రెడ్డి, కూతురుతో కలిసి మరో దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. అంతే కాకుండా.. లక్ష్మి తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లోని రూమ్ బ్యాచిలర్స్ కి  మాత్రమే అద్దెకిచ్చి వారి దగ్గర నుంచి వీర్యం సేకరించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

మాదాపూర్, అమీర్పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ల తో పరిచయాలు పెంచుకొని దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. లక్ష్మి రెడ్డి, కొడుకు సురేందర్ రెడ్డి ఏజెంట్లుగా పని చేస్తూ..  అండాలు కావాలన్నా.. సరోగసి కోసం మహిళలు కావాలన్నా అరేంజ్ చేస్తామని వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మూడు సార్లు అండాలు ఇస్తే 30 వేల రూపాయలు ఇస్తానని, సరోగసి ద్వారా పిల్లలను కనిస్తే 4 లక్షలు ఇస్తానని మహిళలకు వల వేసినట్లు తెలిపారు పోలీసులు.

లక్ష్మీ రెడ్డి ఏజెంట్ గా ఉన్న 6 హాస్పిటల్స్ కి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు పోలీసులు.హెగ్డే, శ్రీఫెర్టిలిటీ, అను, అమూల్య, ఈవీఎఫ్, ఫర్టి కేర్‌ ఆస్పత్రికి సంబందించిన రికార్డులను పరిశీలించనున్నారు అధికారులు. లక్ష్మీ రెడ్డి, నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు పోలీసులు. 

నిందితులు ఇప్పటివరకు 50 మంది మహిళలతో సరోగసి చేయించినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.నిందితురాలు లక్ష్మి సరోగసి ద్వారా బిడ్డలను కని ఇచ్చిన మహిళల లిస్ట్, వాళ్లకు ఇచ్చిన డబ్బుల వివరాలు కోసం డైరీ మెయింటైన్ చేస్తుందని తెలిపారు పోలీసులు.