నీటి వాటాలను తేల్చాల్సిందే..మాకు రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: భట్టి విక్రమార్క

నీటి వాటాలను తేల్చాల్సిందే..మాకు రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: భట్టి విక్రమార్క

అమరావతి: బసకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం తెచ్చుకున్నదే నదీ జలాల కోసం.. బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసమని స్పష్టంచేశారు. తమ రాష్ట్రంలో ప్రాజె క్టులు పూర్తై.. నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాల అంశం తేల్చుకోవాలన్నారు. 

వైజాగ్ లో  భట్టి మాట్లాడుతూ 'వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుంది. నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదే మాకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దేవాదులు వంటి గోదావరిపై మేం చేపట్టిన ప్రా జెక్టులు పూర్తి కాలేదు. మా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వాటాల కవాటాలు తేల్చి మిగిలిన వాటిని సమృద్ధిగా వాడుకోవచ్చు. మా అవసరాలు తీరకుండా దిగువ ప్రాజెక్టులు నిర్మాణం జరిగితే ఆ తర్వాత కేటాయింపుల సమస్యలు ఎక్కువవుతాయి. సముద్రంలోకి వెళ్లే జలాల అని మాట్లాడటం అర్థం చేసుకోలేని అమాయకులు ఎవరు లేరు. తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. అసంతృప్తి అనేది కొందరు ప్రచారం చేస్తున్నారు. చంద్ర బాబు, రేవంత్, రాహుల్ హాట్ లైన్ పై జగన్ నా  వాఖ్యలు వ్యక్తిగతమైన రాజకీయ ఆరోపణ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పార్టీ విధానాలు విశాలమైన ప్రయోజనాలతో ఉంటాయి తప్ప సంకుచితమైన మనస్తత్వంతో ఉండవు' అని తెలిపారు.

ఈసీ తీరు ప్రమాదకరం

 ఓట్ చోరీ విషయంలో వస్తున్న ఆరోపణలపై స్పందించకుండా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకే అనుకూలంగా వ్యవహరించే ప్రయ త్నం అత్యంత ప్రమాదకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఓటర్లను లగిచండం పొర హక్కులను కాలరాయడమే నని విమర్శించారు. ఇవాళ ఏపీ రాష్ట్రంలోని వైజాగ్లో సాప్ ఓట్ చోర్ క్యాంపెయిన్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్వోపీ రాహుల్ గాంధీ యాత్రపై భట్టి మీడియాతో మాట్లాడుతూ కావాల్సిన వాళ్లను ఓటరు లిస్ట్ లో చేర్చుకుని బీజేపీ లబ్ది పొందింది. ఓటు చోరీ జరిగిన తీరును ప్రజల కళ్లకు కట్టేలా రాహుల్ వివరించారు. బీహార్ లో తలపెట్టిన ఓట్ అధికార్ యాత్రకు రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు.

►ALSO READ | మేడ్చల్ సరోగసి కేసులో షాకింగ్ నిజాలు: ఇంటి ఫస్ట్ ఫ్లోర్ రూమ్ బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చి మరీ... వీర్యం సేకరణ.. !