
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా బాలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతున్నాడు. అతని తొలి వెబ్‌సిరీస్, 'ది బర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సిరీస్ కోసం ఆర్యన్ దర్శకత్వంతో పాటు కథను కూడా తానే రాశాడు. నెట్‌ఫ్లిక్స్ , రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ ప్రీవ్యూ ఆగస్టు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఒక సరికొత్త ప్రయాణం
ఈ వెబ్‌సిరీస్ టైటిల్ , ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ లుక్‌లో ఆర్యన్ ఖాన్ వాయిస్ ఓవర్ ఉంది. ఆ వాయిస్ ఓవర్ అతని తండ్రి షారుఖ్ ఖాన్ స్టైల్‌లో ఉంది. అయితే, షారుఖ్ ఖాన్ ప్యార్ (ప్రేమ) గురించి మాట్లాడగా, ఆర్యన్ వార్ (యుద్ధం) గురించి మాట్లాడతాడు.
ఈ సిరీస్‌లో బాబీ డియోల్, లక్ష్య (కిల్ ఫేమ్), మనోజ్ పహ్వా, మోనా సింగ్, మనీష్ చౌదరి, రాఘవ్ జుయల్, మరియు అన్య సింగ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, ఆలియా భట్ వంటి స్టార్స్ కూడా ఇందులో ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ భారీ తారాగణం సిరీస్ పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది.
బాలీవుడ్‌లో కొత్త ఒరవడి?
ఆర్యన్ ఖాన్ ఈ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌లో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తారని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ సిరీస్ కేవలం ఒక వినోదాత్మకంగానే కాకుండా, లవ్ , యాక్షన్ చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఆర్యన్ తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. 'ది బర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' నెట్‌ఫ్లిక్స్‌లో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
►ALSO READ | ఎప్పుడైనా బుల్లెట్ దిగొచ్చు.. జాగ్రత్త: ఎల్వీష్ యాదవ్ ఇంట్లో కాల్పులకు భావు గ్యాంగ్ బాధ్యత