సఫారీని వెంబడించి మరీ దాడి చేసిన చిరుత .. వీడియో వైరల్

సఫారీని వెంబడించి మరీ దాడి చేసిన చిరుత .. వీడియో వైరల్

చిరుత దాడి చేస్తే ఎలా ఉంటుంది.. మాటు వేసి.. అదును చూసి ఒక్క సారిగా దూకుతుంది కదా. దొరికామో ఇక అంతే. వన్య మృగాలను చూసేందుకు వెళ్లిన టూరిస్టులకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. చూసేందుకు ఆగి ఉన్న సఫారీపై దాడి చేసింది. ఈ దాడిలో ఓ బాలుడికి గాయపడ్డాడు. శుక్రవారం (ఆగస్టు 15) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అడవి జంతువులను, పక్షులను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఇష్టపడుతుంటారు. అటవీ శాఖ అధికారులు సఫారీ వాహనాలలో తీసుకెళ్లి జాగ్రత్తగా వన్య ప్రాణులను చూపిస్తుంటారు. ఎక్కువ శాతం సఫారీ వెహికిల్స్ పై క్రూర మృగాలు దాడి చేయవు. కొన్ని సందర్భాల్లో ఊహించని షాక్ లు ఇస్తుంటాయి. 

బెంగళూరులోని బన్నేర్ఘట్టి బయోలాజికల్ పార్కులో చూసేందుకు ఆగిన సఫారీపై దాడి చేసింది చిరుత. వన్య ప్రాణులను చూస్తూ వెళ్తున్న సఫారీ రోడ్డుపై చిరుత ఉండటం చూసి కాస్త ముందుకెళ్లి ఆపారు. పట్టించుకోనట్లు ఉన్న చిరుతు ఒక్క పరుగులో సఫారీని చేరుకుని దాడి చేసింది. ఈ దాడిలో 13 ఏళ్ల బాలుడికి గాయాలయ్యాయి. గాయపడిన బాలుడిని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందించారు. 

►ALSO READ | ఆగస్టు17 నుంచి రాహుల్ గాంధీ ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’

చిరుతు సఫారీ కిటీకి మీదుగా పంజాతో కొట్టడంతో బాలుడికి తాయాలు అయ్యాయి. చిరుత దాడికి  బాలుడు భయంతో అరవగా వెంటనే సఫారీ డ్రైవర్ వేగం పెంచాడు. అయినప్పటికీ చిరుతు చాలా దూరం సఫారీని తరిమింది. ఈ ఇన్సిడెంట్ ను ఓ టూరిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.