BDRCLలో అసిస్టెంట్ మేనేజర్, సూపర్వైజర్ పోస్టులు.. డిగ్రీ ఉన్న చాలు.. ఎగ్జామ్ లేకుండా జాబ్..

BDRCLలో అసిస్టెంట్ మేనేజర్, సూపర్వైజర్ పోస్టులు.. డిగ్రీ ఉన్న చాలు.. ఎగ్జామ్ లేకుండా జాబ్..

భారుచ్ దహేజ్ రైల్వే కంపెనీ లిమిటెడ్ ( BDRCL )  సూపర్​వైజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 28. 

పోస్టుల సంఖ్య:  04.

పోస్టులు: ఆఫీస్​ సూపర్​వైజర్(ఎస్–2) ఫైనాన్స్ & అకౌంట్స్ 02, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–I  ఫైనాన్స్ & అకౌంట్స్  01,  అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్- II  ఫైనాన్స్ & అకౌంట్స్  01, 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బి.కాం, సీఏ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 26.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 28. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.