
మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కాం, కాళేశ్వరం స్కాం, ఔటర్ స్కామ్, హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మడం మీరు చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా అంటూ కేటీఆర్ అని ప్రశ్నించారు. ఇలాంటి దోపిడి దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడానికి, భూములు అమ్ముకోవడానికి కాదన్నారు.
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, నాగార్జున సాగర్, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ చుట్టూ స్థాపించిన ఇండస్ట్రీస్ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో చేసినవేనన్నారు. ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ సర్కార్ చేసిందేమి లేదన్నారు. ప్రజల్లో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరిగిందని.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న పాదయాత్రలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు.