కరోనా తో మృతి చెందిన ప్ర‌తి వ్య‌క్తి మ‌ర‌ణానికి సీఎం కేసీఆరే కారణం

కరోనా తో మృతి చెందిన ప్ర‌తి వ్య‌క్తి మ‌ర‌ణానికి సీఎం కేసీఆరే కారణం

నిజామాబాద్: కరోనాతో చనిపోయిన ప్రతి వ్యక్తి మ‌ర‌ణానికి సీఎం కేసీఆరే కారణమ‌ని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన భట్టి… రోగులను ప‌రామ‌ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా వైద్యం పైన ఆసక్తి లేని ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడని, కేసీఆర్ పాలనలో డాక్టర్లను రిక్రూట్మెంట్ చేసిన పరిస్థితి లేదన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.

ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే సెక్యూరిటీ గార్డ్ తో నెట్టి వేయించే పరిస్థితి నెలకొందని అన్నారు ఉత్త‌మ్. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఐసొలేషన్ ఏర్పాటు చెయ్యలన్నారు. కరోనా తో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేయాల‌న్నారు. రాష్ట్రంలో ఎల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల‌న్నారు.