విద్యుత్​ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేస్తుంటే భయమెందుకు?

విద్యుత్​ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేస్తుంటే  భయమెందుకు?

 

  • విచారణ జరపాలనిచెప్పినోళ్లే ఇప్పుడు ఆందోళన చెందుడేంది?
  • బీఆర్​ఎస్​ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్​

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరపాలని కోరిన వాళ్లే ఇప్పుడు ఆ విచారణ అంటేనే భయపడిపోతున్నారని బీఆర్​ఎస్​ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. ‘‘విద్యుత్ కొనుగోలు అంశంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని చర్చకు పెడితే.. న్యాయ విచారణ జరపాలని జగదీశ్​రెడ్డి పదేపదే కోరారు. దీంతో సభా నాయకుడు రేవంత్ రెడ్డి అంగీకరించి.. ఇప్పుడు విచారణ జరిపిస్తే.. ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదు” అని బట్టి అన్నారు. బుధవారం గాంధీభవన్​లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. 

రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ముందు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేయదంటూ బీఆర్ఎస్  తప్పుడు ప్రచారం చేసింద ని.. కానీ తాము రైతుల ఖాతాలో డబ్బు వేసి చూపిం చామని ఆయన అన్నారు. అప్పులు చేస్తామని, సంపద సృష్టిస్తామని, ఆ సంపదను సంక్షేమ పథ కాల రూపంలో రాష్ట్ర ప్రజలకు పంచుతామని తెలి పారు. ‘‘ఈ దేశ సంపద, వనరులు దామాషా ప్రకా రం పంచబడాలని రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాష్ట్రంలో రాహుల్ ఆలోచనలను అమలు చేస్తున్నాం. దేశంలో కులగణన జరగాలని రాహుల్ ఇచ్చిన పిలుపు విప్లవాత్మకమైనది” అని డిప్యూటీ సీఎం భట్టి  చెప్పారు. కుల గణన చేస్తామని ఎన్నికల ముందు రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రకటించారని, అధికారంలోకి రాగానే ఆ దిశగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి కూడా కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్​ చేశారు. 

అంతా తానేనని కట్టిండు.. కూలిపోయింది

‘‘ఇంజనీర్లను కాదని అంతా తానే అన్నట్టు కేసీఆర్... కాళేశ్వరం కడితే కూలిపోయింది. మేడిగడ్డలో వేసిన ఇసుక మేటలను తొలగిస్తేనే ప్రాజెక్టు మరమ్మత్తు పనులు ప్రారంభమవుతాయి” అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. కేంద్రం చేసే కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ లో  కేటాయింపులు ఉంటాయని తెలిపారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమించిన పార్టీ నాయకుల పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం అధిష్టానం వద్ద ఉందని, త్వరలోనే వీరందరికి నామినేటెడ్ పదవులను పంపిణీ చేస్తామని అన్నారు.