ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మీ స్కీం అమలు: భట్టి

ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మీ స్కీం అమలు: భట్టి

గత ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం  ఇబ్బంది పడ్డారని.. ఆర్టీసీ సంస్థ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ కూడా ఉండేది కాదన్నారు. మంగళవారం హైద్రాబాద్ నెక్లెస్  రోడ్ లో బీఆర్ అంబెడ్కర్ స్టాచు దగ్గర 25 మెట్రో ఎలెక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో ఆర్టీసీకి పనర్ వైభవం తీసుకొచ్చామన్నారు. TSRTC అభివృద్ధికి ప్రభుత్వ సహాయం అందిస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారాయన.25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఆగస్టు నాటికి మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 

మహాలక్ష్మీగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని..  ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మీ స్కీం అమలు చేస్తున్నామని.. మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు డీప్యూటీ సీఎం. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కృషికి ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం పొన్నం ప్రభుత్వానికి చెబుతున్నారన్నారు. రోడ్లు కోసం కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చి రూరల్లో రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డిని ప్రశంసించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిది.. 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని భట్టీ అన్నారు.