V6 News

జావేద్‌‌‌‌‌‌‌‌కు భట్టి, తుమ్మల నివాళి

జావేద్‌‌‌‌‌‌‌‌కు భట్టి, తుమ్మల నివాళి

ఖమ్మం టౌన్, వెలుగు: సూర్యాపేట సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మహ్మద్ జావేద్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు. గురువారం ఖమ్మం పట్టణంలోని రెడ్ హిల్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న జావేద్ నివాసానికి వెళ్లిన వారు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి జావేద్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్థివదేహాన్ని అరగంట ఉంచి, ఖిలాలోని మజీద్ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైరా ఎమ్మెల్యే రాందాసు నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సిటీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.