వీలైతే LRS చెల్లించకండి.. కేసీఆర్ శాశ్వతం కాదు

వీలైతే LRS  చెల్లించకండి.. కేసీఆర్ శాశ్వతం కాదు

ఎల్ ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం పేదలపై భారం మోపుతుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఎల్ఆర్ఎస్ పై ఎవరూ ఆందోళన వద్దని. కేసీఆర్ శాశ్వతం కాదన్నారు. ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎల్ ఆర్ఎస్ డీలింక్ చేస్తామన్నారు. అప్పుల భారం ప్రజలపై ఇప్పుడే మొదలైందన్నారు. 2-3ఏళ్లలో అప్పుల భారం ఎలా ఉంటుందోనని భయంగా ఉందన్నారు. వీలైతే ఎల్ఆర్ఎస్ చెల్లించవద్దన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రజలకు వెసులుబాటు కల్పించేలా ఉండాలన్నారు. పన్నులతో ప్రజలను పీడించే వ్యవస్థ మొదలైందన్నారు. నిజాం కాలంలో పంట కంటే శిస్తు ఎక్కువ వేసేవారన్నారు. తెలంగాణలో మళ్లీ వెట్టి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

ఎంత ధైర్యం.. ప్రియాంకపై చేయి వేస్తావా?

అప్పుల బాధతో ప్రాణం తీసుకున్న ప్రైవేట్ టీచర్

డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు

భారత్ లో 66 లక్షలు దాటిన కేసులు