బిగ్ బాస్ పదవవారం షాకింగ్ ఎలిమినేషన్.. భోలే షావలి ఔట్?

బిగ్ బాస్ పదవవారం షాకింగ్ ఎలిమినేషన్.. భోలే షావలి ఔట్?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) మెుదటి నుంచి చెప్పినట్టుగానే ఉల్టా పుల్టాగా సాగుతోంది. గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది. నామినేషన్స్, ఊహించని ఎలిమినేషన్స్, రీ ఎంట్రీలు.. అబ్బో ఇలా చాలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ పట్టుకొచ్చారు మేకర్స్. 

ఇక ఇప్పటివరకు తొమ్మదిమంది ఇంటినుండి బయటకుక్ వెళ్లిపోగా.. పదవవారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. ఈ వారం నామినేషన్స్ లో యావర్, గౌతమ్,శివాజీ,రాతిక,బోలీ ఉన్నారు. శుక్రవారం నాటికీ ఓటింగ్ కూడా పూర్తయ్యింది. దీంతో ఈవారం ఎలిమినేట్ కంటెస్టెంట్ ఎవరు అనేది డిసైడ్ అయిపోయింది. నిన్నమొన్నటివరకు భోలే టాప్ 5 వరకు ఉంటారు అనుకున్నారు కానీ.. ఈవారం ఆయనకే వోటింగ్ చాలా వరకు తగ్గింది.  

పాట బిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు భోలే షావలి. అలాగే తన అద్భుతమైన టాలెంట్ తో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పటికప్పుడు ట్యూన్స్ కట్టి పాటలు పాడుతూ.. మెస్మరైజ్ చేశారు భోలే. అంత ప్రత్యేకతను తెచ్చుకున్నా కూడా అతన్ని పదోవారంలో ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. దీంతో ఆడియన్స్ షాకవుతున్నారు. ఈవారం రతికా ఇంటినుండి బయటకు వెళ్తుంది అనుకున్నారంతా కానీ.. అనూహ్యంగా భోలే ఎలిమినేట్ అవుతున్నాడు. దీంతో భోలే షావలి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.