Allu Arjun: ఆరుగురు భామలతో ఐకాన్ స్టార్ 'విశ్వరూపం'.. అల్లు అర్జున్ - అట్లీ క్రేజీ ప్రాజెక్ట్‌లో అనుష్క శర్మ?

Allu Arjun: ఆరుగురు భామలతో ఐకాన్ స్టార్ 'విశ్వరూపం'.. అల్లు అర్జున్ - అట్లీ క్రేజీ ప్రాజెక్ట్‌లో అనుష్క శర్మ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #AA22xA6 (వర్కింగ్ టైటిల్) .  ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన కీలక అప్టేడ్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.  ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పుష్ప2 తర్వాత వస్తున్న మూవీ కావడంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో భాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

ఆరుగురు భామలు సందడి..

ఈ మూవీ స్టార్ క్యాస్టింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇప్పటికే గ్లోబల్ స్టార్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ఖరారైంది. వీరితో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి టాప్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అనుష్క శర్మ కూడా తోడైతే, ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు నుండి ఆరుగురు స్టార్ హీరోయిన్లు ఉన్నట్లు లెక్క. అయితే, ఇంతమంది హీరోయిన్లు ఉండటంతో సహజంగానే అభిమానుల్లో ఒక ఆందోళన మొదలైంది. "అసలు ఒక్కొక్కరికి ఎంత స్క్రీన్ టైమ్ ఉంటుంది?" అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ అట్లీ మార్క్ మేకింగ్ తెలిసిన వారు మాత్రం, ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుందని భావిస్తున్నారు.

 ఐకాన్ స్టార్ 4 విభిన్న పాత్రలు!

ఈ సినిమా కాన్సెప్ట్ గురించి వస్తున్న లీకులు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇది ఒక హై-బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) డ్రామా అని, ప్యారలల్ యూనివర్స్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. విదేశీ సాంకేతిక నిపుణులు, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. అంతేకాదు, ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒకే కుటుంబానికి చెందిన నాలుగు విభిన్న పాత్రల్లో అంటే తాత, తండ్రి,  ఇద్దరు కొడుకులు కనిపిస్తారని టాక్. ఈ ప్రయోగాత్మక కథ వల్లే ఇంతమంది హీరోయిన్లకు స్కోప్ ఉందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.

ఏప్రిల్ 8న కీలక ప్రకటన..

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అసలైన అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 8, 2026న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానున్నట్లు సమాచారం. ఈ టీజర్ సినిమాలోని అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేయబోతోంది.

అనుష్క శర్మకు 'పవర్ ఫుల్' కమ్‌బ్యాక్?

2018లో వచ్చిన 'జీరో' తర్వాత అనుష్క శర్మ వెండితెరకు దూరంగా ఉన్నారు. మధ్యలో 'చక్దా ఎక్స్‌ప్రెస్' వంటి సినిమాలు లైన్‌లో ఉన్నా, అల్లు అర్జున్ సినిమాతో ఆమె చేసే రీ-ఎంట్రీ గ్లోబల్ స్థాయిలో ఉంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అట్లీ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పేలా ఉంటాయి కాబట్టి, అనుష్కకు ఇది సరైన ప్లాట్‌ఫారమ్ అని చెప్పొచ్చు. అయితే అనుష్కశర్మ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2027లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్యారలల్ యూనివర్స్ లో బన్నీ చేసే మాయాజాలం ఎలా ఉంటుందో చూడాలి మరి.