ఆవారాపన్‌‌ 2 టీజర్ రిలీజ్.. సరికొత్త లుక్‎లో దిశా పటాని

ఆవారాపన్‌‌ 2 టీజర్ రిలీజ్.. సరికొత్త లుక్‎లో దిశా పటాని

ఇటీవల ‘వెల్‌‌కమ్ టు ది జంగిల్‌‌’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దిశా పటాని..  ఆగస్టు నెలలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇమ్రాన్‌‌ హష్మీతో కలిసి ఆమె నటించిన ‘ఆవారాపన్‌‌ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతోంది. 2007లో వచ్చిన ‘ఆవారాపన్‌‌’కు ఇది సీక్వెల్. తాజాగా టీజర్‌‌‌‌ను విడుదల చేశారు.  19 ఏళ్ల తర్వాత మరోసారి శివం పాత్రలో ఇమ్రాన్‌‌ హష్మీ కనిపించాడు.  ఫస్ట్ పార్ట్‌‌లో చనిపోయాడనుకున్న శివమ్ గుండె నిండా బాధతో తన ప్రియురాలు అలియా సమాధి దగ్గర కనిపించాడు.  

ఆ తర్వాత అండర్‌‌వరల్డ్ గ్యాంగ్‌‌స్టర్లతో శివమ్ చేసే ఫైట్స్‌‌తో భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌లు ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు.  ఇక గ్లామరస్‌‌, యాక్షన్ రోల్స్‌‌కు కేరాఫ్‌‌ అయిన దిశా పటాని అందుకు పూర్తి భిన్నంగా ఇందులో కనిపించింది.  తన క్యారెక్టర్‌‌‌‌ను ఎక్కువగా రివీల్ చేయనప్పటికీ తన లుక్‌‌ సాఫ్ట్‌‌గా, హుందాగా ఎమోషనల్‌‌ టచ్‌‌తో ఉంది. 

 తనకు ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా స్క్రీన్ ప్రెజెన్స్‌‌తో ఇంప్రెస్ చేసింది.  ఫస్ట్ పార్ట్‌‌లో శ్రియ పోషించిన అలియా పాత్ర తరహాలో ఇందులో దిశా క్యారెక్టర్‌‌‌‌ కీలకంగా నిలవబోతోందని తెలుస్తోంది.  షబానా అజ్మీ 'నఫీసా' అనే పవర్‌‌ఫుల్ విలన్ పాత్రలో నటించారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌‌ను విశేష్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది.