ఓ.. సుకుమారి వస్తోంది.. తిరువీర్, ఐశ్వర్య కొత్త సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్

ఓ.. సుకుమారి వస్తోంది.. తిరువీర్, ఐశ్వర్య కొత్త సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్

తిరువీర్, ఐశ్వర్య రాజేష్​ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, మంగళవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. జులై 17న ఈ సినిమాను  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో  విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో  హీరో, హీరోయిన్  ఒకరినొకరు తాకబోతున్న క్షణాన్ని మెరుపులతో విజువల్‌‌గా చూపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని  పెంచుతోంది.  హీరోయిన్‌‌ను తాకిన ఎవరికైనా కరెంట్  షాక్ కొడుతుందనే  ఒక విచిత్రమైన కాన్సెప్ట్‌‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.