ఒక్క బాంబు అంటే ఒక్క బాంబు.. మా పవర్ ప్లాంట్ పై (విద్యుత్ స్టేషన్లు) పడినా చూస్తూ ఊరుకునేది లేదని తెగేసి చెప్పింది ఇరాన్. 48 గంటల్లో హర్మూజ్ జల సంధిని ఓపెన్ చేయాలని.. లేకుంటే ఇరాన్ దేశంలోని పవర్ ప్లాంట్లు లక్ష్యంగా దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ వార్నింగ్ ఇచ్చి 24 గంటలు గడిచిపోయింది. ఈ క్రమంలోనే ట్రంప్ వార్నింగ్ పై ఇరాన్ స్పందించింది. ఇరాన్ వార్నింగ్ ఎలా ఉందో తెలుసుకుందామా..
మా దేశంలోని ఒక్క పవర్ ప్లాంట్ పై బాంబు పడినా.. మా పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసినా.. గల్ప్ దేశాల్లో చీకట్లు ఖాయం. గల్ప్ దేశాల్లోని ఒక్క పవర్ ప్లాంట్ ను కూడా వదలకుండా.. అన్నింటిని ధ్వంసం చేస్తాం.. గల్ఫ్ దేశాలను చీకట్లోకి నెడతాం అంటూ రివర్స్ లో మాస్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.
జస్ట్ మాటలతో వదిలిపెట్టలేదు ఇరాన్ దేశం. గల్ఫ్ దేశాల్లో పవర్ ప్లాంట్లు.. ( విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు.. విద్యుత్ ప్లాంట్లు) ఫొటోలను రిలీజ్ చేసింది. ఇరాన్ పరిధిలోకి గల్ఫ్ దేశాలను కరెంట్ సప్లయ్ చేసే పవర్ ప్లాంట్లు ఇవే. అంటూ ఓ ఇమేజ్ రిలీజ్ చేసింది ఇరాన్ దేశం.
ఇరాన్ దేశంలోని ఒక్క పవర్ ప్లాంట్ మూతపడినా.. దాడి జరిగినా.. గల్ఫ్ దేశాల్లోని ప్రతి పవర్ ప్లాంట్ ను నేలమట్టం చేస్తాం.. దాడులతో విధ్వంసం చేస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది.
►ALSO READ | ట్రక్కును ఢీకొన్న కెనడా విమానం : అమెరికా ఎయిర్ పోర్టులో ప్రమాదం
అంతే కాకుండా హర్మూజ్ జల సంధి ఓపెన్ అయ్యే ఉందని.. ఎవరూ దాన్ని క్లోజ్ చేయలేదని.. బీమా ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ ఇవ్వవనే భయంతో.. బీమా రాదనే భయంతోనే హర్మూజ్ జల సంధి నుంచి నౌకలు వెళ్లటం లేదని.. ఎవరూ దాన్ని అడ్డుకోవటం లేదని వెల్లడించింది ఇరాన్.
అంతే కాదు.. హర్మూజ్ జల సంధి నుంచి వెళ్లే ఒక్కో ఆయిల్ నౌక నుంచి 19 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని ధృవీకరించింది. ఛార్జీలు వసూలు చేస్తున్నామని.. ఇది ఇరాన్ దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనం అని స్పష్టం చేసింది ఇరాన్.
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చి 24 గంటలు గడిచిపోయింది.. డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగుస్తున్న సమయంలో ఇరాన్ దేశం ఇచ్చిన మాస్ రిప్లయ్ వార్నింగ్ తో ప్రపంచ దేశాలు అన్నీ వణికిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఇందులో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒకటి..
