శ్రీరామనవమి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ సూచించారు. శోభాయాత్రకు 3 వేల మంది పోలీస్ బందోబస్త్, డ్రోన్లు,సీసీ కెమెరాల నిఘాతో పరిశీలిస్తామని చెప్పారు సజ్జనార్.
శ్రీరామ నవమి ఉత్సవ కమిటితో ఇవాళ సమన్వయ సమావేశం నిర్వహించిన సజ్జనార్.. 16 సంవత్సరాలుగా శోభయాత్ర సమర్ధవంతంగా సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సారి కూడా పకడ్బంధీగా ఏర్పాట్లు చేశామన్నారు. అందరి సహకారంతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శోభాయాత్ర కమిటీ సూచించిన కొన్ని అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.
శోభాయాత్రకు పిక్ మార్కెటింగ్, చైన్ స్నాచింగ్ జరగకుండా క్రైమ్ టీమ్లను షీ టీం లను మోహరిస్తామని చెప్పారు సజ్జనార్ . శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లతో పర్యవేక్షిస్తామని చెప్పారు. శోభాయాత్ర సాగే మార్గాలు సీసీ టీవీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గత ఏడాది వెహికల్ బ్రేక్ డౌన్ వల్ల శోభాయాత్ర నెమ్మదించింది కానీ.. ఈ సారి అలాంటి సమస్యలు లేకుండా శోభాయాత్రను అనుకున్న సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సీపీ సజ్జనార్
