V6 News

పేదింటి ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి

పేదింటి ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి

రేగొండ, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

బుధవారం రేగొండ రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ గోరి కొత్తపల్లి, రేగొండ మండలాల 118 లబ్ధిదారుల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుటోజు కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు విజ్జన్ రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.