
హైదరాబాద్‌సిటీ, వెలుగు : టీపీసీసీ లీగల్ సెల్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం అంతారం గ్రామానికి చెందిన భ్యాగరి హనుమంతు నియమితులయ్యారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ లీగల్‌సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా చైర్మన్ భిక్షమయ్య గౌడ్ నియామకపత్రాన్ని అందజేశారు.
హనుమంతు లీగల్సెల్కన్వీనర్గా మాత్రమే కాకుండా రంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని పొన్నం అశోక్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో లీగల్‌సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ దేవగౌడ్, రాష్ట్ర కన్వీనర్ కుర్మ నరేందర్ పాల్గొన్నారు.