గ్రీన్ కార్డులపై బ్యాన్‌‌ ఎత్తేసిన బైడెన్

గ్రీన్ కార్డులపై బ్యాన్‌‌ ఎత్తేసిన బైడెన్

వాషింగ్టన్: కరోనా విపత్తు నేపథ్యంలో గ్రీన్ కార్డులపై ట్రంప్ విధించిన బ్యాన్ ను అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ రద్దు చేశారు. అమెరికాకు వచ్చే ఇమిగ్రెంట్లకు పర్మనెంట్ రెసిడెన్సీ కోసం గ్రీన్ కార్డులు(పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్స్) జారీ చేస్తుంటారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత అమెరికన్ వర్కర్లకు అవకాశాలు తగ్గిపోరాదన్న ఉద్దేశ్యంతో అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ దేశంలోకి గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ (ఇమిగ్రెంట్స్) రాకను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను బైడెన్ బుధవారం రద్దు చేశారు. తాజా నిర్ణయంతో వేలాది మంది ఇండియన్లకు ప్రధానంగా హెచ్1బీ వీసాలపై అమెరికా వెళ్లే ఇండియన్ టెకీలకు ప్రయోజనం కలగనుంది.