టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం ఎత్తివేత?

V6 Velugu Posted on Jun 09, 2021

  • ట్రంప్ నిర్ణయాలను పునః సమీక్షిస్తున్న అధ్యక్షుడు బైడెన్

వాషింగ్టన్:  టిక్ టాక్ యాప్ పై నిషేధాన్ని అమెరికా ఎత్తివేయనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా మొదటి దశ మహమ్మారి ప్రబలిన వెంటనే  చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పునః సమీక్ష చేపట్టినట్లు వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. టిక్ టాక్ యాప్ తోపాటు.. వుయ్ ఛాట్ తదితర యాప్ లలో భద్రతాపరమైన అంశాలను వాణిజ్య విభాగం పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న అనేక నిర్ణయాలను జో బైడెన్  అధ్యక్షుడిగాఎన్నికైన తర్వాత రద్దు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే కోవలోనే టిక్‌ టాక్‌, వి చాట్‌ యాప్స్‌పై విధించిన నిషేధాన్ని కూడా త్వరలోనే బైడెన్‌ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ వాణిజ్య విభాగం టిక్‌టాక్‌పై భద్రత పరమైన అంశాలను తాజాగా వాణిజ్య విభాగం పరిశీలిస్తోందని యూఎస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

Tagged tik tok, , US lifting Ban, Biden replaces Trump’s order, sought to ban TikTok, Biden revokes Trump\\\\\\\'s orders

Latest Videos

Subscribe Now

More News