రికార్డుల ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. పదోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం తర్వాత తన కేబినెట్ ను ప్రకటించారు. అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి కీలక పదవులు ఇచ్చారు. LJP (R), HAM ,RLM వంటి చిన్న మిత్రపార్టీలకు కూడా ముఖ్యమైన శాఖలు కేటాయించారు.
89 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీ గా ఉన్న బీజేపీ కొత్త బీహార్ మంత్రివర్గంలో అత్యధిక పదవులను దక్కించుకుంది. హోంశాఖ, భూమి, రెవెన్యూ, ఆరోగ్య వంటి కీలక శాఖలను దక్కించుకుంది. సామ్రాట్ చౌదరి హోంశాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖను సీఎం నితీష్ కుమార్ చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.
ఇక విజయ్ కుమార్ సిన్హాకు భూవి, రెవెన్యూతో పాటు గనులు, భూగర్భ శాఖను కట్టబెట్టారు. మంగళ్ పాండేకు ఆరోగ్యం,న్యాయశాఖలను అప్పజెప్పారు. దిలిప్ జైస్వాల్ కు పరిశ్రమల శాఖను ఇచ్చారు. మరో బీజేపీ ఎమ్మెల్యే నితిన్ నవీన్ కు పట్టణాభివృద్ది గృహనిర్మాణ శాఖను అప్పజెప్పారు.
గురువారం పాట్నాలోని గాంధీ మైదానంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీనియర్ ఎన్డీయే నేతలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎం హాజరయ్యారు. 74 ఏళ్ల నితీష్ కుమార్ 26 మంది మంత్రులతో తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంది జెడి(యు) నుంచిఎనిమిది మంది, ఇద్దరు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ,హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఎం) ,రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎమ్) ఒక్కొక్కరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
నితీష్ కుమార్ తన కేబినెట్ లో చిన్న మిత్ర పార్టీ లకు పదవులు ఇచ్చారు. చెరకు పరిశ్రమ ,ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖలను LJP (R) దక్కించుకుంది. మైనర్ వాటర్ రిసోర్సెస్ శాఖను HAMకి ,పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను RLM చేపట్టింది.
బీజెపికి కేటాయించిన మంత్రిత్వ శాఖలు..
- ఆరోగ్యం , న్యాయశాఖ- మంగళ్ పాండే
- రోడ్డు నిర్మాణం, పట్టణాభివృద్ధి గృహనిర్మాణం-నితిన్ నవీన్
- వ్యవసాయం- రాంకృపాల్ యాదవ్
- టూరిజం, కళలు, సంస్కృతిక ,యువజన శాఖ– అరుణ్ శంకర్ ప్రసాద్
- సమాచారం ,ప్రజా సంబంధాలు, క్రీడలు –శ్రేయసి సింగ్
- పరిశ్రమలు - దిలీప్ జైస్వాల్
- కార్మిక వనరులు –సంజయ్ టైగర్
- మత్స్య శాఖ –సురేంద్ర మెహతా
- విపత్తు నిర్వహణ శాఖ - నారాయణ ప్రసాద్
- SC/ST సంక్షేమం శాఖ- లఖేంద్ర పాశ్వాన్
- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ–రామా నిపత్
- అటవీ శాఖ- ప్రమోద్ చంద్ర బన్షి
