
- హన్మంతరావు వర్సెస్ బీఆర్ఎస్ మధ్యే పోటీ
- ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలోకి ఎమ్మెల్యే మైనంపల్లి
- సిట్టింగ్‌సీటును మరోసారి గెలిచేలా మంత్రి ఫోకస్
- బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డికి తరఫున క్యాంపెయిన్
- గెలిపిస్తే దత్తత తీసుకుంటానంటూ ప్రచార హామీ
- తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు
హైదరాబాద్,వెలుగు : గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లింలు, క్రిస్టియన్లు, తమిళులు, బ్రాహ్మణ, సెటిలర్లు ప్రధానంగా నివసిస్తున్నారు. వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారే విజేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. మల్కాజిగిరి, హనుమాన్‌పేట, వాణినగర్, ఆర్కే నగర్తదితర ప్రాంతాల్లో బ్రాహ్మణ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆర్కేపురం, అమ్ముగూడ, యాప్రాల్ తదితర ప్రాంతాల్లో తమిళ ఓటర్లు ఎక్కువే. మౌలాలి, సఫిల్‌గూడ, అల్వాల్తదితర ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు, బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖరరెడ్డి, బీజేపీ నుంచి రామచందర్‌రావు పోటీ చేస్తున్నారు. వారి బలాబలాలను చూస్తే త్రిముఖ పోటీ నెలకొంది.
ఈసారి హాట్‌టాపిక్‌గా సెగ్మెంట్
ఈసారి మల్కాజిగిరి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్కు అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ లో చేరడం ఆసక్తికరంగా మారింది. మైనంపల్లి తన సీటుతో పాటు కుమారుడికి మెదక్ సీటు కోసం బీఆర్ఎస్లో ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరి రెండు టికెట్లు సాధించుకున్నారు.
మంత్రి హరీశ్ రావు ఫోకస్ పెట్టగా..
మూడు పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు గెలుస్తారా..? అనే దానిపైనే రాజకీయ విశ్లేషకులు ఫోకస్ పెట్టారు. అధికార బీఆర్ఎస్ నేతలను ఎదిరించిన మైనంపల్లి తన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే మంత్రి హరీశ్‌రావుతో ఆయనకున్న విభేదాలు పార్టీ వీడడానికి కారణమైనా.. తన విజయానికి ఢోకా లేదని మైనంపల్లి ధీమాతో ఉండగా, ఆయనను ఓడించాలన్న పట్టుదలతో మంత్రి హరీశ్‌రావు ఉన్నారు. అందుకు తాను మల్కాజిగిరిని దత్తత తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించారు.
గెలుపుపై మైనంపల్లి ధీమా
ఎమ్మెల్యే మైనంపల్లి తన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీలో నిలవగా.. గత ఎన్నికల్లో తన విజయానికి పాటుపడిన కార్యకర్తలు బీఆర్ఎస్లోనే అధికంగా ఉండిపోయారు. దీంతో ఈసారి తన విజయమంతా సొంత ఇమేజ్ తోపాటు కాంగ్రెస్వేవ్ పైనే ఆధారపడి ఉంది. ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని మైనంపల్లి ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను ఎక్కువ మందికి అందేలా కృషి చేసినట్టు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత కలిసొస్తుందంటున్నారు. ఇక ఆయన మైనస్లకు వస్తే.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ హవాలో గెలిచారని, ఆ తర్వాత సెగ్మెంట్లో చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయనే వాదన ఉంది.
చెరువుల బ్యూటిఫికేషన్ పూర్తికాలేదు. వానాకాలంలో బస్తీలు, కాలనీలు నీట మునుగుతుంటాయి. ముఖ్యంగా ఎన్ఎండీసీ కాలనీ, అనంత సరస్వతికాలనీ, పటేల్‌నగర్, బండచెరువు, బలరాంనగర్ వంటి ప్రాంతాల్లో వరదల సమస్యలను ఆయన పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పథకాలే గెలిపిస్తయంటున్నర్తిగా ఉన్నాయనే వాదన ఉంది. చెరువుల బ్యూటిఫికేషన్ పూర్తికాలేదు. వానాకాలంలో బస్తీలు, కాలనీలు నీట మునుగుతుంటాయి. ముఖ్యంగా ఎన్ఎండీసీ కాలనీ, అనంత సరస్వతికాలనీ, పటేల్‌నగర్, బండచెరువు, బలరాంనగర్ వంటి ప్రాంతాల్లో వరదల సమస్యలను ఆయన పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్పథకాలే తన గెలుపును నిర్ణయిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డి ధీమాతో ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్ఫాలోయింగ్తో విజయం సాధిస్తానంటున్నారు. మంత్రి హరీశ్‌రావు కూడా ఇక్కడ రాజశేఖర్‌కు ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా మైనంపల్లిని ఓడించడమే తన లక్ష్యమని మంత్రి చెప్తున్నారు. గెలిపిస్తే నియోజకవర్గాన్ని తానే దత్తత తీసుకుంటానని హామీ ఇస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా రాజశేఖరరెడ్డికి గుర్తింపు ఉంది.
గత పార్లమెంట్ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎమ్మెల్యేగా ప్రజలు తనను గెలిపిస్తారని భావిస్తున్నారు. మైనస్‌లు చూస్తే.. ఇప్పటి వరకూ ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకపోవడం, ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం. విద్యావేత్తగా విద్యాసంస్థలు కలిగి ఉండడంతో స్థానికంగా గుర్తింపు పొందారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, తన గెలుపు ఖాయమని చెబుతున్నారు.
వారి కుమ్ములాటలే కలిసొస్తయంటున్న రామచందర్ రావు
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రామచందర్‌రావు ఈసారి కూడా బరిలోకి దిగారు. నియోజకవర్గం ప్రజలకు సుపరిచితుడే. ఇక్కడ కీలకంగా ఉన్న బ్రాహ్మణ ఓటర్లను ఆయన నమ్ముకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు. పార్టీకి పెద్దసంఖ్యలో ఉన్న కార్యకర్తలతో విజయం వరిస్తుందని భావిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో పార్టీకి ఆదరణ పెరిగిందని, ఇక్కడి నుంచి తన గెలుపు ఖాయమని ధీమాగా చెబుతున్నారు.
మైనస్‌లను చూస్తే.. సెగ్మెంట్ పై రాంచందర్‌రావు నిర్లక్ష్యంగా ఉంటారనే వాదన ఉంది. కేవలం ఎన్నికలప్పుడే ఆయన తెరమీదకు వస్తుంటారనే విమర్శ ఉంది. ఇక్కడ పార్టీ గెలిచే స్థాయిలో లేదనే ప్రచారం ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్‌పట్ల ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదని, ఇవే తన గెలుపును ఈజీ చేస్తాయని ఆయన భావిస్తున్నారు. ఇలా మూడు పార్టీల అభ్యర్థులు గెలుపు ధీమాతో ఉండగా ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.