- ప్రత్యేక పర్యాటక రైళ్లలో కాశ్మీర్, వైష్ణో దేవి యాత్రలు
పంజాగుట్ట, వెలుగు: ప్రత్యేక పర్యాటక రైళ్లలో కాశ్మీర్ హాలిడే స్పెషల్, వైష్ణో దేవి యాత్రలు ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతాయని స్టార్ రైల్ ప్రోడక్ట్ డైరెక్టర్ విఘ్నేశ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యాత్ర వివరాలను ఆయన వెల్లడించారు. టూర్ రిజర్వేషన్లను నేరుగా 93550 21516 నంబర్లో సంప్రదించడం లేదా ఆన్లైన్లో www.tourtimes.in మాత్రమే చేసుకోవచ్చన్నారు.
కాశ్మీర్ హాలిడే స్పెషల్లో అగ్ర, మథుర, శ్రీనగర్, సోన్ మార్గ్, గుల్మార్గ్, అమృత్సర్, ఢిల్లీని సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో పర్యాటకుల కోసం భారతీయ రైల్వే 33 శాతం సబ్సిడీ ఇస్తున్నదని చెప్పారు. ప్రత్యేక పర్యాటక రైలు పెనుకొండ, ధర్మవరం, అనంతపూర్, గుత్తి, దోనె, కర్నూల్, గద్వాల్, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు.
