బిగ్ బాష్ -2019 విజేత రెనిగేడ్స్

బిగ్ బాష్ -2019 విజేత రెనిగేడ్స్

మెల్‌బోర్న్‌: రెండు నెలలుగా ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించిన బిగ్ బాష్ లీగ్ ఇవాళ్టితో ముగిసింది. మెల్ బోర్న్ రెనిగేడ్స్ విజేతగా నిలిచింది. అసాధారణ ఆటతో ఫైనల్లో ఊహించని విక్టరీ సాధించింది ఆరోన్ ఫించ్ టీమ్. ఆదివారం మెల్‌ బోర్న్‌ స్టార్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించి, ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇది రెనిగేడ్స్‌ కు ఫస్ట్ BBL టైటిల్‌. ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన మెల్‌ బోర్న్‌ స్టార్స్‌ ఫీల్డింగ్‌ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్‌ చేపిన రెనిగేడ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసింది. రెనిగేడ్స్‌ టాపార్డర్‌ ఘోరంగా విఫలమైనా ఆరో స్థానంలో వచ్చిన టామ్‌ కూపర్‌(43 నాటౌట్‌), ఏడో స్థానంలో వచ్చిన డానియల్‌ క్రిస్టియన్‌(38 నాటౌట్‌)లు ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోరును రెనిగేడ్స్‌ బోర్డుపై ఉంచింది.

స్మాల్(146) టార్గెట్ తో  బ్యాటింగ్‌ కు దిగిన మెల్‌ బోర్న్‌ స్టార్స్‌కు శుభారంభం లభించింది. ఆ టీమ్ ఓపెనర్లు బెన్‌ డంక్‌(57), మార‍్కస్‌ స్టోనిస్‌(39)లు ఫస్ట్ వికెట్‌ కు 93 రన్స్ భాగస‍్వామ్యాన్ని అందించి టీమ్ ను పటిష్ట స్థితిలో నిల్పారు. ఆ తర్వాత  వరుస వికెట్లు కోల్పోయి, గెలిచే మ్యాచ్ ను చేతులారా చేజార్చుకున్నారు. ఆడమ్‌ జంపా(17) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. 19 పరుగుల  వ్యవధిలో ఆ టీమ్ 7 వికెట్లను చేజార్చుకుని పరాజయం కొనితెచ్చుకుంది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఓటమి పాలైంది.