బిగ్ బాస్ అమర్ దీప్, సుప్రీత జంటగా నయా మూవీ షురూ

బిగ్ బాస్ అమర్ దీప్, సుప్రీత జంటగా నయా మూవీ షురూ

‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్ దీప్ హీరోగా,  నటి సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ప్రారంభమైంది. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌లో గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. 

ముహూర్తపు సన్నివేశానికి  బసిరెడ్డి క్లాప్ కొట్టగా, నిర్మాత ఏఎం రత్నం కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌తో పాటు కమెడియన్ రఘు, సురేఖా వాణి, గౌతమ్ కృష్ణ, తేజస్వి తదితరులు పాల్గొన్నారు.