నటి అర్చన వేద ఎంగేజ్ మెంట్

నటి అర్చన వేద ఎంగేజ్ మెంట్

టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ అర్చన వేద నిశ్చితార్థం జరిగింది. లీడింగ్ హెల్త్ కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ తో అర్చన ఎంగేజ్ మెంట్ జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య సంప్రదాయపద్ధతిలో నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హోటల్ రాడిసన్ బ్లూలో నిర్వహించారు. అర్చన చేతివేలికి జగదీష్ వజ్రపు ఉంగరం తొడిగాడు.

సినిమా సెలబ్రిటీలు సుమంత్, నవదీప్, శివబాలాజీ దంపతులు, బిగ్ బాస్ కో కంటెస్టెంట్స్ , ఫ్యామిలీ మెంబర్స్ ఈ వేడుకకు హాజరయ్యారు.