ప్రధాని మోదీ చేయి చూసిన సీఎం నితీష్ కుమార్: ఆ ఇంక్ ఏంటి?

ప్రధాని మోదీ చేయి చూసిన సీఎం నితీష్ కుమార్: ఆ ఇంక్ ఏంటి?

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్ ప్రధాని మోదీ చేతి వేళ్లను పరిశీలించారు. సడన్ గా నితీశ్ మోదీ చేతిని పట్టుకొని చూపుడు వేలికి ఉన్న ఇంక్ అదేంటని అడిగారు. ఎన్నికల్లో ఓటు వేసినప్పుడు రాసిన ఇంక్ అని మోదీ నితీశ్ కు సమాధానం ఇచ్చారు. వీరిద్ధరి మధ్య ఈ షాకింగ్ సంభాషణ ప్రస్తుతం మీడియాలో వైరల్‌ అవుతుంది.

రాజ్‌గిర్‌లోని నలంద యూనివర్శిటీలో కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఇతర నేతలు హాజరైయ్యారు. నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా వేదికపై మాట్లాడుతున్నప్పుడు నితీశ్ మోదీ చేయి పట్టుకొని వేలుకు ఉన్న సిరా చుక్కను చెక్ చేశారు.