రైలులో చోరీకి యత్నం..చితక్కొట్టిన ప్రయాణికులు

రైలులో చోరీకి యత్నం..చితక్కొట్టిన ప్రయాణికులు

ఇటీవల బీహార్లో కదులుతున్న రైలులో చోరీకి యత్నించి 15 కిలోమీటర్లు కిటికీ వేలాడి ప్రయాణికులకు పట్టుబడ్డాడు ఓ దొంగ. తాజాగా మరో దొంగ సైతం ఇలాంటి దొంగతనానికే యత్నించి ప్రయాణికుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. జమాల్పూర్–సాహిబ్గంజ్ రైలు ఘోమా స్టేషన్ లో ఉండగా..ఓ దొంగ కిటికీలోంచి ప్రయాణికుడి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు.
 
ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయి దొంగను కిటికీలోంచి గట్టిగా పట్టుకున్నారు. రైలు కదలడంతో విడిచిపెట్టాలని దొంగ ఎంత వేడుకున్నా ప్రయాణికులు విడిచిపెట్టలేదు. కొంతదూరం వెళ్లాక దొంగను రైలులోకి లాగి చితక్కొట్టారు. అనంతరం అతడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.