గండిపేట, వెలుగు: అడ్వర్టైజ్మెంట్ బోర్డును బైక్ఢీకొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. బండ్లగూడకు చెందిన వుయ్యాల సరిశ్ (23) తన స్నేహితుడు క్రిష్సింగ్తో కలిసి శుక్రవారం ఉదయం కాళీమందిర్ వద్ద టిఫిన్ చేసి బైక్పై తిరిగి వస్తున్నారు. సన్సిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డును ఢీకొట్టారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమైన సరిశ్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన క్రిస్సింగ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
