2 లక్షల సైకిళ్లు పోయినయ్‌‌: పోలీసులకు బైక్ షేర్ కంపెనీ ఫిర్యాదు

2 లక్షల సైకిళ్లు పోయినయ్‌‌: పోలీసులకు బైక్ షేర్ కంపెనీ ఫిర్యాదు
  • దొంగతనం, ధ్వంసం.. 2600 మంది అరెస్టు

చైనీస్‌‌ బైక్‌‌ షేర్‌‌ స్టార్టప్‌‌ కంపెనీ ‘మోబైక్‌‌’కు 2019లో చేదు అనుభవం మిగిలింది. సుమారు 2 లక్షల సైకిళ్లను కంపెనీ పోగొట్టుకుంది. ఈ విషయాన్ని స్వయంగా తన కంపెనీ బ్లాగ్‌‌లో పోస్టు చేసింది. 2019లో బాగానే నష్టమొచ్చిందని చెప్పింది. బీజింగ్‌‌లో తమ సైకిళ్లను దొంగతనం, నాశనం చేసిన సుమారు 2,600 మందిని పోలీసులు అరెస్టు చేశారంది.

2018లో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరగడంతో మాంచెస్టర్‌‌లో సేవలను ఆపేశామంది. అక్కడ 2017 జులై నుంచి 2018 ఆగస్టు మధ్య సుమారు 400 ఇలాంటి సంఘటనలు జరిగాయని వివరించింది. టైన్‌‌ నదిలో కొందరు బైక్‌‌లను పడేసిన సంఘటనలు పెరగడంతో బ్రిటన్‌‌లోని గేట్‌‌షెడ్‌‌, న్యూకాటెల్‌‌ ప్రాంతాల్లోనూ సేవలను నిలిపేసింది.  చైనాకు చెందిన ఫుడ్‌‌ డెలివరీ సర్వీస్‌‌ మెయ్‌‌టువాన్‌‌ డియాన్‌‌పింగ్‌‌ సంస్థదే ఈ ‘మోబైక్‌‌’. 2018లో రూ. 19 వేల కోట్లకు సంస్థను డియాన్‌‌పింగ్‌‌ కొనుగోలు చేసింది. సిల్వర్‌‌, ఆరెంజ్‌‌ రంగుల్లో సైకిళ్లుంటాయి. పనైపోయాక పబ్లిక్‌‌ ప్లేస్‌‌లో పార్క్‌‌ చేసేయొచ్చు. క్రెడిట్‌‌ స్కోర్‌‌ సిస్టమ్‌‌నూ కంపెనీ స్టార్ట్‌‌ చేసింది. సరిగా ప్రవర్తించని వారికి రేటింగ్‌‌ తగ్గిస్తుంటుంది. బ్రిటన్‌‌లో సైకిల్‌‌ను అన్‌‌లాక్‌‌ చేయడానికి ఫీజు రూ. 94. కాలుష్యంతో సతమతమవుతున్న చైనాలో ఈ సైకిళ్లకు బాగానే డిమాండ్‌‌ ఉంది.