డూప్లికేట్​ కీస్​తో బైక్​ చోరీలు

డూప్లికేట్​ కీస్​తో బైక్​ చోరీలు
  •     బైక్​ మెకానిక్, ముగ్గురు మైనర్లు అరెస్ట్​

పద్మారావునగర్, వెలుగు: బైక్​ చోరీలకు పాల్పడుతున్న బైక్​మెకానిక్​ను ఈస్ట్​జోన్​పోలీసులు అరెస్ట్​చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌‌ భోలక్‌‌పూర్‌‌కు చెందిన పస్తం వంశీతేజ అలియాస్‌‌ నాగులబండ(21) బైక్‌‌ మెకానిక్‌‌. ఇతనికి రిపేర్లు చేయడంతోపాటు డూప్లికేట్​కీస్ తయారుచేయడం వచ్చు. నెల రోజుల కింద సరూర్‌‌నగర్‌‌కు చెందిన ఓ యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. 

బైక్​రిపేర్లతో వచ్చే ఆదాయం సరిపోక ఈజీ మనీ కోసం ముగ్గురు మైనర్లతో కలిసి డూప్లికేట్​కీస్​తో బైక్​చోరీలు స్టార్ట్​చేశాడు. ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 2, బోడుప్పల్‌‌లో 3, ఉప్పల్‌‌ లో 2  బైకులను ఎత్తుకెళ్లాడు. వాటిని మైనర్ల ఇంటి వద్ద దాచాడు. శుక్రవారం ఉదయం సీతాఫల్‌‌మండి చౌరస్తాలో వంశీతేజ పోలీసులకు చిక్కాడు. 

వంశీతేజ గతంలో చోరీ, గంజాయి కేసులో జైలుకు వెళ్లొచ్చాడని పోలీసులు తెలిపారు. మరో కేసులో తుకారంగేట్‌‌కు చెందిన కారు డ్రైవర్​అడ్డాకుల విజయ్‌‌కుమార్‌‌, ఆలకుంట అక్షయ్‌‌ను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిద్దరూ కలిసి తొమ్మిది బైకులు చోరీ చేసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.