జీడిమెట్లలో ప్రైవేట్ బస్సు బీభత్సం.. బైక్ పైకి దూసుకెళ్లింది..

జీడిమెట్లలో ప్రైవేట్ బస్సు బీభత్సం.. బైక్ పైకి దూసుకెళ్లింది..

హైదరాబాద్ జీడిమెట్లలో ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న బైక్ పైకి బస్సు దూసుకెళ్లడంతో బైకిస్ట్ కి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ( ఆగస్టు 25 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

జీడిమెట్ల పీఎస్ పరిధిలోని RDPL కంపెనీకి కాజిపల్లికి చెందిన ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న బైక్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది బస్సు.

డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో బైకిస్టు తలకు తీవ్ర గాయమయ్యింది.క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.