ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఆర్టీసీ విలీనం బిల్లుకు  ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి, వెలుగు: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే కీలక బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లోకి తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచే జీతాలు చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో రూపొందించిన బిల్లును ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. జనవరి 1  నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. కొత్త చట్టంతో 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆర్టీసీ విలీనం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పని చేసే ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకోరాదని మాజీ సీఎం చంద్రబాబు 1997లో చేసిన చట్టం అడ్డంకిగా మారిందన్నారు. అందుకే కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపారు.

Bill to treat RTC employees as govt staff passed by Andhra Assembly