
న్యూఢిల్లీ: బర్డ్ ఫ్లూ మరిన్ని రాష్ట్రాలకు పాకుతోంది. ఇప్పటి వరకు 7 రాష్ట్రాల్లో కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఢిల్లీ, చత్తీస్ గఢ్ , మహారాష్ట్రలో మరణించి న పశువులు, పక్షుల కళేబరాల శాం పిల్స్‌ను పరీక్షల కోసం పంపిం చారు. తాజాగా యూపీలో బర్డ్ ఫ్లూకనిపిం చగా, ఇది వరకే కేరళ, హిమాచల్ ప్రదేశ్ , హర్యానా,గుజరాత్ , మధ్యప్రదేశ్ , రాజస్థా న్ లో కేసులు రికార్డయ్యాయని కేం ద్ర పశుసంవర్థక శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ లో భారీగా కోళ్లు, బాతులు,పశువులు మరణించాయి. మహారాష్ట్రలోని చాలాచోట్ల ఆవులు ప్రాణాలు కోల్పో యా యి. ఈ బీమారి వ్యాప్తిని అడ్డుకోవడానికి మరిన్ని కోళ్లను, బాతులను, పశువులను పెద్ద ఎత్తు న చంపడం తప్పదని ఆఫీసర్లు ప్రకటిం చారు.