కుక్కకు డ్రోన్లతో బర్త్​డే సెలబ్రేషన్స్​

కుక్కకు డ్రోన్లతో బర్త్​డే సెలబ్రేషన్స్​
  • రూ. 11 లక్షల ఖర్చుతో 520 డ్రోన్లతో విషెస్ చెప్పిన చైనా మహిళ 

హునాన్: పెంపుడు కుక్క మీదున్న ప్రేమతో ఓ మహిళ డ్రోన్లతో రూ. 11 లక్షలు ఖర్చు పెట్టి భారీగా పుట్టినరోజు వేడుక చేసింది. కానీ, అదే ఆమెను చిక్కుల్లో పడేసింది. నో ఫ్లై జోన్​లో డ్రోన్లను ఎగరేయడంతో అధికారులు వాటిని కూల్చేశారు. చైనాలోని హునాన్​ ప్రావిన్స్​చాంగ్షాలో ఈ ఘటన జరిగింది. పెంపుడు కుక్క డౌడౌ 10వ పుట్టినరోజును గ్రాండ్​గా సెలబ్రేట్​ చేసేందుకు మాండరిన్​ భాషలో ‘ఐ లవ్​యూ’ అని అర్థం వచ్చేలా 520 డ్రోన్లతో ఆకాశంలో లైట్​షో నిర్వహించింది. అయితే, పర్మిషన్ లేకుండా రెసిడెన్షియల్ ఏరియాలో వాటిని ఎగరేయడంతో అధికారులు వాటిని వెంటనే కూల్చేశారు.