బర్త్ డే విషెస్ ఫ్రీ, పనికి రానివి కూడా.. నన్ను ఎవరూ విష్ చేయకండి : ఆర్జీవీ

బర్త్ డే విషెస్ ఫ్రీ, పనికి రానివి కూడా.. నన్ను ఎవరూ విష్ చేయకండి : ఆర్జీవీ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, కీలక, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో నిలిచే సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏప్రిల్ 7న తన బర్త్ డే అని, ఈ సందర్భంగా ఎవరూ తనకు శుభాకాంక్షలు చెప్పొద్దంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో పాటు.. విషెస్ అనేవి దేనికీ పనికి రావని చెప్పారు.“రేపు (7వ తేదీ) నా పుట్టిన రోజు. దయచేసి నాకు శుభాకాంక్షలు చెప్పకండి. విషెస్ అనేవి ఉచితం అయినవి, పనికి రానివి కూడా. నేను చౌకైన బహుమతులతో సరిపెట్టుకుంటాను. ఉచితం కంటే చౌక ఉత్తమం అని నా అభిప్రాయం” అంటూ ఆర్జీవీ ట్వీట్ లో రాసుకొచ్చారు.

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీ్ట్ కు నెటిజన్లు ఈ తరహాలోనే కామెంట్లు పెడుతున్నారు. రేపు నా జాతిపిత పుట్టినరోజు సందర్బంగా సెలవు దినముగా ప్రకటించాలంటూ ఓ యూజర్ మహాత్మా గాంధీలా ఉన్న ఆర్జీవీ ఫొటోను షేర్ చేశారు. మరికొందరేమో మీరు చేసిన ట్వీట్ చీపా లేదంటే ఫ్రీనా అంటూ ప్రశ్నిస్తున్నారు. సరే చెప్పనులే టీ పంపిస్తా తాగు అంటూ ఇంకొందరు సెటైరికల్ కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/RGVzoomin/status/1643807793579978752