V6 News

ముంబైలో దారుణం.. బిర్యానీ, పుచ్చకాయ తిని ఫ్యామిలీ మొత్తం మృతి

ముంబైలో దారుణం.. బిర్యానీ, పుచ్చకాయ తిని ఫ్యామిలీ మొత్తం మృతి

ముంబై: ముంబైలోని పైధోని ప్రాంతంలో ఫుడ్ పాయిజనింగ్ తో ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అబ్దుల్లా డోకాడియా (40), నస్రీన్ డోకాడియా (35), వారి కుమార్తెలు ఆయిషా (16), జైనాబ్ (13)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 25న రాత్రి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బిర్యానీ తిన్నారు. 

అనంతరం అర్ధరాత్రి నలుగురు కలిసి పుచ్చకాయ తిన్నారు. దీంతో తెల్లవారుజామున వారికి వికారం, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే జేజే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్న కుమార్తె జైనాబ్ మరుసటి రోజు ఉదయం మరణించగా అదేరోజు రాత్రి తండ్రి అబ్దుల్లా ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత తల్లి, పెద్ద కుమార్తె చికిత్సకు స్పందించక మరణించారు.